శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 17, 2020 , 01:12:06

టాటా ప్రాజెక్ట్స్‌ కుకొత్త పార్లమెంటు కాంట్రాక్టు

టాటా  ప్రాజెక్ట్స్‌ కుకొత్త పార్లమెంటు కాంట్రాక్టు

  • రూ. 861.90 కోట్ల బిడ్‌తో దక్కించుకున్న సంస్థ
  • ఏడాదిలో పూర్తికానున్న పనులు 

న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవన నిర్మాణ ప్రాజెక్టును టాటా ప్రాజెక్స్‌ దక్కించుకున్నది. భవన నిర్మాణానికి కంపెనీల ఎంపిక కోసం కేంద్ర ప్రజాపనుల విభాగం ఇటీవల బిడ్డింగ్‌ నిర్వహించింది. భవన నిర్మాణానికి రూ.940 కోట్లు అవుతుందని అంచనా వేయగా రూ.861.90 కోట్లకే టాటా ప్రాజెక్ట్స్‌ బిడ్‌ వేసి నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్నది. ఎల్‌ అండ్‌ టీ రూ.865 కోట్లు బిడ్డింగ్‌ వేసింది. పార్లమెంటు కొత్త భవనాన్ని గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా రెండు అంతస్తులతో త్రికోణాకృతిలో నిర్మించనున్నారు. భవనంపై జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేయనున్నారు. 60వేల చదరపు మీటర్లలో భవన నిర్మాణం ఉంటుంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత పనులు ప్రారంభమై ఏడాదిలో పూర్తవుతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనం బ్రిటిష్‌ కాలంలో కట్టింది. దీనిని కూల్చివేయకుండానే కొత్త బిల్డింగ్‌ కడుతున్నారు. కొత్త నిర్మాణం పూర్తయ్యేదాకా ఈ భవనంలోనే కార్యకలాపాలు సాగుతాయని కేంద్రం తెలిపింది. నిర్మాణం పూర్తయ్యాక కూడా పాత భవనాన్ని కూల్చివేయకుండా ఇతర అవసరాల కోసం వాడతారని కొందరు అధికారులు చెప్పారు.