ఆదివారం 01 నవంబర్ 2020
National - Sep 20, 2020 , 03:34:45

టాటా టెస్టుకు డీసీజీఐ ఓకే

టాటా టెస్టుకు డీసీజీఐ ఓకే

న్యూఢిల్లీ: కరోనా పరీక్ష ఫలితాలను అత్యంత కచ్చితత్వంతో ఇచ్చే దేశీయ ‘సీఆర్‌ఐఎస్‌పీఆర్‌' కొవిడ్‌-19 టెస్టుకు డీసీజీఐ శనివారం అనుమతినిచ్చింది. ఈ మేరకు టాటా గ్రూప్‌ వివరాలు వెల్లడించింది. ఈ టెస్టింగ్‌ ప్రక్రియను టాటా గ్రూప్‌, సీఎస్‌ఐఆర్‌-ఐజీఐబీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కరోనా వైరస్‌ ఉనికిని, జన్యు క్రమాన్ని అత్యంత కచ్చితత్వంతో తాము అభివృద్ధి చేసిన దేశీయ సీఆర్‌ఐఎస్‌పీఆర్‌ సాంకేతికత సాయంతో కనుగొనవచ్చని టాటా గ్రూప్‌ ప్రతినిధులు తెలిపారు.