సోమవారం 25 జనవరి 2021
National - Nov 24, 2020 , 13:44:54

వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు: ఉద్ధ‌వ్ థాక‌రే

వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు: ఉద్ధ‌వ్ థాక‌రే

న్యూఢిల్లీ: మ‌హారాష్ట్రలో క‌రోనా వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా కోసం ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామ‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాకరే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి తెలియ‌జేశారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో ఉద్ధ‌వ్ మాట్లాడారు. క‌రోనా వ్యాక్సిన్ పంపిణీతోపాటు, వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ కోసం తాము ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ప‌నిచేస్తుంద‌ని ఆయన తెలిపారు. 

అదేవిధంగా సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదేర్ పూనంవాలాతో తాము ట‌చ్‌లో ఉన్నామ‌ని ఉద్ధ‌వ్ థాక‌రే ప్ర‌ధానికి చెప్పారు. ఆక్స‌ఫ‌ర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ త‌యారీలో సీరం ఇన్‌స్టిట్యూట్ భాగ‌స్వామిగా ఉన్న‌ది. టీకా అందుబాటులోకి రాగానే ప్ర‌ణాళికాబ‌ద్దంగా పంపిణీ చేయ‌డానికి తాము ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ ప‌నిచేస్తుంద‌న్నారు.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo