సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 21, 2020 , 15:23:45

35శాతం కార్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యం : ప్రధాని

35శాతం కార్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యం : ప్రధాని

గాంధీనగర్: కార్బన్ ఉదర్గాలను 30 నుంచి 35 శాతం తగ్గించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అన్నారు. ఇక్కడ పండిట్ దీన్‌దయాల్ పెట్రోలియం విశ్వవిద్యాలయం (పీడీపీయూ) కాన్వొకేషన్ వేడుకలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి, మాట్లాడారు. ఈ రోజు, మన దేశం కార్బన్ ఉద్గారాలను 30 నుంచి 35 శాతం తగ్గించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అదే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేసిందని.. భారత్‌ దాన్ని సాధించగలదా? అని ఆశ్చర్యపోయిందని అన్నారు. ఈ దశాబ్దంలో సహజ వాయువు సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాబోయే ఐదేళ్లలో చమురు శుద్ధి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే పని కూడా కొనసాగుతోందని ప్రకటించారు. ఇంధన రంగంలో స్టార్టప్‌లను బలోపేతం చేసే పని నిరంతరం జరుగుతోందని, ఇందుకు ప్రత్యేక నిధిని కేటాయించినట్లు మోదీ చెప్పారు. చమురు, గ్యాస్ రంగంలో మాత్రమే ఈ దశాబ్దంలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారని, కాబట్టి ఈ రంగంలో విద్యార్థులకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.