శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 15:56:50

తనిష్క్ ను బహిష్కరించాలంటున్ననెటిజన్లు..

  తనిష్క్ ను బహిష్కరించాలంటున్ననెటిజన్లు..

ముంబై :ప్రముఖ జ్యువెల్లరీ విక్రయదారు తనిష్క్ మరోసారి చిక్కుల్లో పడింది. ఇటీవలే తనిష్క్ తీసిన ఓ యాడ్ వివాదాస్పదంగా మారింది. ఓ వర్గానికి చెందిన వారు ఆ యాడ్ తమను కించ పరిచే విధంగా ఉందంటూ ఫైర్ అయ్యారు. తనిష్క్ లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తుందని, వెంటనే ఆ యాడ్‌ను తీసేయాలని డిమాండ్ చేశారు. అయితే తనిష్క్ వెంటనే ఆ యాడ్‌ను తొలగించిన విషయం తెలిసిందే. దీపావళి నేపథ్యంలో తనిష్క్  రూపొందించిన యాడ్ అభాసుపాలవుతున్నది. ఈ ప్రకటనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చరాదని, కేవలం దీపాలు వెలిగించి పండుగను జరుపుకోవాలని తనిష్క్ మరో ప్రకటన రూపొందించింది. అందులో అలయా ఎఫ్‌, నిమ్రత్ కౌర్‌, సయాని గుప్తా, నీనా గుప్తాలు నటించారు. అయితే దీపావళి యాడ్ కూడా వివాదాస్పదమైంది. కర్ణాటక ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సోషల్ మీడియా వేదికగా తనిష్క్ పై ఫైర్ అయ్యారు.

"హిందువులు పండుగలను ఎలా జరుపుకోవాలనే విషయాన్ని మాత్రమే ఎందుకు చెబుతారు ? కంపెనీలు తమ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెడితే బాగుంటుంది..! ఒక వర్గానికి చెందిన వారి సంస్క్రృతి సంప్రదాయాలపై ఉపన్యాసాలు ఇవ్వకూడదు, దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో చెప్పాల్సిన అవసరం లేదు. మేము దీపాలు వెలిగిస్తాం, స్వీట్లు పంచుకుంటాం..! పర్యావరణానికి హాని కలిగించని బాణసంచా కాలుస్తాం..! అందరూ కలిసి రండి, ఏకత్వం అంటే ఏమిటో తెలుస్తుంది.." అని సీటీ రవి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.జర్నలిస్టును హత్య చేసిన స్మగ్లింగ్ ముఠా


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

కంటి అద్దాల కంటే కాంటాక్ట్‌ లెన్స్‌లు ఎందుకు బెటర్‌?

దీపావళి రోజున మధుమేహులకు 'తీపి' కబురు

సిగ్గు పడే వారు తాగితే రెచ్చిపోతారట!

తొందరగా పిల్లలు కలగాలంటే ఈ ఫుడ్‌ తినండి..!

కుంకుమ పువ్వుకు ఎందుకు అంత డిమాండ్