శనివారం 16 జనవరి 2021
National - Nov 25, 2020 , 12:44:04

హిందీని మాపై ఎందుకు రుద్దుతున్నారు?

హిందీని మాపై ఎందుకు రుద్దుతున్నారు?

చెన్నై: హిందీని త‌మిళ ప్ర‌జ‌లు ఎంత‌లా ద్వేషిస్తారో మ‌రోసారి రుజువైంది. ఇప్పుడు అక్క‌డి సోష‌ల్ మీడియా భార‌త వాతావ‌ర‌ణ శాఖ‌పై అంతెత్తున లేస్తోంది. ఓవైపు నివార్ తుఫాన్ ముప్పు పొంచి ఉన్న స‌మ‌యంలోనూ త‌మిళ నెటిజ‌న్లు మాత్రం హిందీ వ్య‌తిరేక ఉద్య‌మానికి మ‌రోసారి తెర తీశారు. దీనంత‌టికీ కార‌ణం.. నివార్ తుఫాన్ గురించి భార‌త వాతావ‌ర‌ణ శాఖ హిందీలో స‌మాచారం ఇవ్వ‌డ‌మే. త‌న ట్విట‌ర్ ఖాతాలో ఈ తీవ్ర‌మైన తుఫాన్ గురించి హిందీలో స‌మాచారం ఇచ్చింది వాతావ‌ర‌ణ శాఖ‌. అది చూసిన త‌మిళ ప్ర‌జ‌లు తీవ్ర అస‌హ‌నానికి గుర‌య్యారు. హిందీని మాపై ఎందుకు రుద్దుతున్నారు? ఆ భాష త‌ప్ప మ‌రో భాష లేదా? ఇంగ్లిష్ లేదా త‌మిళంలో వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారం ఇవ్వొచ్చుగా అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. మీ పేరును హిందీ వాతావ‌ర‌ణ శాఖ‌గా మార్చుకోండ‌ని ఒక‌రు.. ఫ్రెంచ్ అయినా స‌రేగానీ హిందీ ఎందుకు అని మ‌రొక‌రు.. దీనికోసం త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల ట్యాక్స్‌ల‌ను ఎందుకు వాడుతున్నారంటూ ఇంకొక‌రు.. ఇలా భార‌త వాతావ‌రణ శాఖ‌పై త‌మ అస‌హనాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.