సోమవారం 06 జూలై 2020
National - Jun 30, 2020 , 22:08:54

తమిళనాడులో కొత్తగా 3,943 కరోనా కేసులు

తమిళనాడులో కొత్తగా 3,943 కరోనా కేసులు

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో కొత్తగా 3,943 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 90,167 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 38,889 యాక్టివ్‌ కేసులున్నాయని, 50,074మంది చికిత్సకు కోలుకోగా 1,201మంది మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు బయటకు వెళ్లేప్పుడు విధిగా మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. ఇదిలాఉండగా దేశంలోనూ కరోనా విజృంభిస్తున్నది. ఇప్పటి వరకు 5,66,840 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,15,125 యాక్టివ్‌ కేసులుండగా 3,34,822మంది చికిత్సకు కోలుకోగా 16,893మంది మృతి చెందారని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది.


logo