గురువారం 26 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 07:51:36

జ‌నాల‌ను రూ.5 కోట్ల‌కు ముంచిన ప్రొఫెస‌ర్‌

జ‌నాల‌ను రూ.5 కోట్ల‌కు ముంచిన ప్రొఫెస‌ర్‌

చెన్నై: ఆయ‌న‌ది న‌లుగురిని ఆదర్శ‌వంతులుగా తీర్చిదిద్దే ఉద్యోగం. కానీ జ‌నాల‌కు అధిక డ‌బ్బు ఆశ‌జూపి మోసం చేయ‌డం ప్ర‌వృత్తిగా మార్చుకున్నాడు. ఎక్కువ మొత్తంలో తిరిగిస్తామ‌ని చెప్పి జ‌నాల‌ను రూ.5 కోట్ల‌మేర‌ ముంచాడో ప్రొఫెస‌ర్‌. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో చోటుచేసుకున్న‌ది. 

కోయంబ‌త్తూరులోని ఓ కాలేజీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న ఓ వ్య‌క్తి త‌న కొడుకు, కోడ‌లితో క‌లిసి అధిక‌మొత్తంలో తిరిగిస్తామ‌ని ఆశ‌జూపి జనాల దగ్గ‌ర డ‌బ్బు వ‌సూలు చేశారు. ఇలా మొత్తంగా రూ.5 కోట్ల వ‌ర‌కు పోగుచేశారు. రోజులు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ డ‌బ్బు తిరిగి ఇవ్వ‌క‌పోడంతో మోసపోయామ‌ని గ్ర‌హించిన ఓ బాధితుడు కోయంబ‌త్తూరు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రొఫెస‌ర్ ఇంటిపై దాడిచేసి అత‌న్ని అరెస్టు చేశారు. ఇంట్లో ప‌లు ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వారు ఉప‌యోగిస్తున్న ఎస్‌యూవీ కారును సీజ్ చేశారు. అయితే, ఆయ‌న కొడుకు, కోడ‌లు ప‌రారీలో ఉన్నార‌ని, వారిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశామ‌ని పోలీసులు తెలిపారు. నిందితుల‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.