శుక్రవారం 10 జూలై 2020
National - Jun 19, 2020 , 15:55:36

చెన్నైలో డ్రోన్స్‌తో లాక్‌డౌన్‌ పర్యవేక్షణ

చెన్నైలో డ్రోన్స్‌తో లాక్‌డౌన్‌ పర్యవేక్షణ

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగళ్‌పట్టు జిల్లాలతోపాటు చైన్నెనగరంలో ఆ రాష్ట ప్రభుత్వం నేటి నుంచి ఈనెల 30వరకు లాక్‌డౌన్‌ పొడిగించింది. దీంతో ఆ జిల్లాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు అక్కడి పోలీసులు చర్యలు చేపట్టారు. చైన్నెనగరంలోని చాలా ప్రాంతాల్లో డ్రోన్స్‌ ద్వారా పర్యవేక్షణ చేయలేకపోయినా.. డ్రోన్స్‌ స్పీకర్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తామని పోలీసులు తెలిపారు. ప్రత్యేక అనుమతులున్నవి మినహా నగరంలోకి ఇతర వాహనాలను అనుమతించబోమని చైన్నై పోలీస్‌ కమిషనర్‌ ఏకే విశ్వనాథ్‌ చెప్పారు.  ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 52,334 కరోనా కేసులు నమోదుకాగా చైన్నె నగరంలోనే 37,070 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 625మంది మృతి చెందారు.

logo