గురువారం 04 మార్చి 2021
National - Dec 03, 2020 , 14:59:52

‘రాత్రి కర్ఫ్యూ విధించండి’

‘రాత్రి కర్ఫ్యూ విధించండి’

బెంగళూరు : కర్ణాటకలో రెండో దశ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన మధ్య కర్ణాటకలో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ప్రభుత్వానికి సూచించింది. ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్‌ సుదర్శన్‌ ఈ మేరకు ముఖ్యమంత్రి యడ్యూరప్పకు నివేదికను సమర్పించారు. రెండో దశ కరోనా వ్యాప్తి అత్యంత ప్రమాదకరమని నివేదికలో హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన సంవత్సర వేడుకలకు అవకాశం కల్పించవద్దని సూచించారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 1 వరకు రిసార్ట్స్, హోటళ్ళు, రోడ్లపై (ఎంజీ రోడ్, బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్) తదితర ప్రాంతాల్లో బహిరంగ నూతన సంవత్సర వేడుకలను నిషేధించాలని కోరారు. రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల మధ్య రాత్రి కర్ఫ్యూ విధించాలని సూచించారు. అలాగే కొవిడ్‌-19 మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

VIDEOS

logo