గురువారం 16 జూలై 2020
National - Jun 20, 2020 , 21:40:11

తమిళనాడులో ఒక్కరోజే 33వేలకుపైగా కరోనా పరీక్షలు

తమిళనాడులో ఒక్కరోజే 33వేలకుపైగా కరోనా పరీక్షలు

చెన్నై : తమిళనాడులో రోజురోజుకూ కరోనా విజృంభిస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తమిళనాడులో శనివారం ఒక్కరోజే  రికార్డుస్థాయిలో 33,231 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు సుమారు 8,61,211శ్యాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 56,845 కరోనా కేసులు నమోదుకాగా ఇందులో 24,822 యాక్టివ్‌ కేసులున్నాయని వెల్లడించింది. ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్లతో ఇప్పటి వరకు 704మంది మృతి చెందారని స్పష్టం చేసింది. వైరస్‌ బారినపడి వారిలో శనివారం ఒక్కరోజే 1,045మంది దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారని, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 31వేలకుపైగా ఉందని అధికారులు తెలిపారు. 


logo