ఆదివారం 05 జూలై 2020
National - Jun 20, 2020 , 16:26:14

కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ పాటించాలి

కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ పాటించాలి

చెన్నై : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు తప్పక లాక్‌డౌన్‌ పాటించాలని తమిళనాడు సీఎం యడప్పాడి కే. పలనీస్వామి కోరారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, పబ్లిక్‌ స్థలాల్లో సామాజికదూరం పాటించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో నియంత్రణ చర్యలను సమీక్షించేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, వైద్యులతో మరికొన్ని బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కాంటాక్టులను వెంటనే గుర్తిస్తున్నామని, డాక్టర్లు, వైద్య సిబ్బంది అమోఘంగా శ్రమిస్తుండడంతో కోలుకుంటున్న వారి శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియా, పోలీసుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, స్థానిక మున్సిపల్‌ పాలకవర్గాలు, ఆరోగ్యశాఖ అధికాలు ప్రత్యేక సమావేశాలు, క్యాంపులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8లక్షల శ్యాంపిళ్లను పరీక్షించామని వెల్లడించారు.


logo