మంగళవారం 26 జనవరి 2021
National - Dec 19, 2020 , 12:12:27

ఎన్నిక‌ల ప్ర‌చారానికి అన్నాడీఎంకే రెడీ!

ఎన్నిక‌ల ప్ర‌చారానికి అన్నాడీఎంకే రెడీ!

చెన్నై : త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెల‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయా పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించాయి. తాజాగా అధికార పార్టీ అన్నాడీఎంకే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించేందుకు సిద్ధ‌మైంది. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కే ప‌ళ‌నిస్వామి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన సేలంలో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నున్నారు.

సేలం జిల్లా కేంద్రంలో నిన్న ఏర్పాటు చేసిన స‌మావేశంలో సీఎం ప‌ళ‌నిస్వామి పాల్గొని అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సేలం నియోజ‌క‌వ‌ర్గంలోని సేంద్ర‌య పెరుమాల్ టెంపుల్‌లో పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభిస్తాన‌ని తెలిపారు. ఆ త‌ర్వాత రాష్ర్ట వ్యాప్తంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొంటాన‌ని చెప్పారు. ఇక కార్య‌క‌ర్త‌లే ముందుండి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు. 

ఇప్ప‌టికే డీఎంకే, మ‌క్క‌ల్ నిధి మ‌యం పార్టీలు త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించాయి.


logo