బుధవారం 03 జూన్ 2020
National - May 19, 2020 , 20:29:51

తమిళనాడులో 601, బెంగాల్‌లో 136 కొత్త కేసులు

తమిళనాడులో 601, బెంగాల్‌లో 136 కొత్త కేసులు

హైదరాబాద్‌: తమిళనాడులో మంగళవారం కొత్తగా 601 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,448కి చేరింది. ఇక ఇప్పటివరకు తమిళనాడులో 84 కరోనా మరణాలు సంభవించాయి. మరో 7,466 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లో సైతం మంగళవారం కొత్తగా 136 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి బెంగాల్‌లో మొత్తం కేసుల సంఖ్య 2,961కి చేరింది. 178 మరణాలు సంభవించాయి. 


logo