సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 15:20:15

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం

దేశంలో క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే అన్ని విద్యాసంస్థ‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించిన ఆ రాష్ట్రప్ర‌భుత్వం..1 నుంచి 9వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌న్ని ర‌ద్దుచేసింది. ఈ మేర‌కు అక్క‌డి విద్యాశాఖ ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. అటు వ‌చ్చే అక‌డ‌మిక్ ఏడాదిలోనే క్లాసులు ప్రారంభం కానున్నాయి. కాగా ఇప్ప‌టికే తమిళనాడు లో ఇప్పటి వరకు 18 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒక మ‌ర‌ణం కూడా సంభ‌వించింది. క‌రోనా ఎదుర్కోనేందుకు  ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.


logo