సోమవారం 01 జూన్ 2020
National - May 09, 2020 , 18:08:17

త‌మిళ‌నాడులో లాక్ డౌన్ స‌డ‌లింపులు

త‌మిళ‌నాడులో లాక్ డౌన్ స‌డ‌లింపులు

చెన్నై: నాన్ కంటైన్ మెంట్ జోన్ల‌లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం లాక్ డౌన్ నిబంధ‌న‌ల్లో స‌డ‌లింపులు  ఇచ్చింది. రాష్ట్ర‌వ్యాప్తంగా హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ జోన్లు కాని ప్రాంతాల్లో కొన్ని స‌డ‌లింపులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. చెన్నైలో అన్ని ప్రైవేట్ కార్యాల‌యాలు ఉద‌యం 10.30 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంటల వ‌ర‌కు 33 శాతం సిబ్బందితో విధులు నిర్వ‌ర్తించుకోవ‌చ్చు. మిగితా ప్రాంతాల్లో 10 గంట‌ల నుంచి 7 గంట‌ల వ‌ర‌కు ప‌నులు చేసుకోవ‌చ్చు. 

చెన్నై ప‌రిధిలో కూర‌గాయలు, కిరాణా షాపులు ఉద‌యం 6 గంట‌‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌రకు తెరుచుకోవ‌చ్చు. ఇత‌ర షాపులు ఉద‌యం 10‌:30 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు తెరుచుకునే అవ‌కాశమిచ్చింది. అన్ని కార్యాల‌యాలు, షాపులు, దుకాణ‌స‌ముదాయాల్లో సామాజిక దూరం నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం అన్ని జిల్లాల కలెక్ట‌ర్లు, మున్సిపల్ క‌మిష‌న‌ర్లు, ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు జారీచేసింది. మే 11 నుంచి ఈ స‌డ‌లింపులు అమ‌లు కానున్నాయి. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo