మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 13:41:59

లోకజ్ఙానం లేని త‌ల్లి! కూతురు పెళ్లికోసం దాచిన డ‌బ్బు చెల్ల‌వ‌ని తెలియ‌డంతో..

లోకజ్ఙానం లేని త‌ల్లి! కూతురు పెళ్లికోసం దాచిన డ‌బ్బు చెల్ల‌వ‌ని తెలియ‌డంతో..

పాత 500, 1000 నోట్ల‌ను ర‌ద్దు చేసి నాలుడేండ్లు అవుతున్నా.. ఇప్ప‌టికీ కొంత‌మందికి ఈ విష‌యంపై అవ‌గాహ‌న లేదు. పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలియక ఇద్దరు మహిళలు పెద్ద సంఖ్యలో రూ.500 నోట్లను దాచిపెట్టిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇది మ‌రువ‌క ముందే ఇలాంటి సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. నాగపట్టణం జిల్లా కొళ్లిడం సమీపంలోని పట్టియమేడుకు చెందిన రాజదురై, ఉష దంపతులు నిరక్షరాస్యులు. వీరిది రెక్కాడితే గాని డొక్కాడ‌ని కుటుంబం. కూతురు పెళ్లి కోసం కొంచెం కొంచెంగా డబ్బు పోగు చేసుకున్నారు. ఇప్పుడ‌వి చెల్ల‌వ‌ని తెలిసి గుండె ప‌గిలేలా ఏడుస్తున్నారు.

కూలి ప‌నిలో వ‌చ్చిన డ‌బ్బుని పోగుచేసి ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో చుట్టి ఇంటి వెనుక గుంత త‌వ్వి పాతి పెట్టింది త‌ల్లి. ఇటీవ‌ల ఇంటి నిర్మాణ ప‌నుల్లో ఆ డ‌బ్బు బ‌య‌ట‌ప‌డింది. అవన్నీ రద్దయిన నోట్లని చెప్పడంతో దంపతులిద్దరూ దిగ్భ్రాంతి చెందారు. వీటి విలువ రూ. 35, 500 వ‌ర‌కూ ఉంటుంది. ఎంత ఏడ్చినా డ‌బ్బు చెల్ల‌ద‌ని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని దంప‌తులిద్ద‌రూ వేడుకుంటున్నారు. ఇప్ప‌టికీ డీమానిటైజేష‌న్ గురించి తెలియ‌ని వారున్నారా అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు.


logo