బుధవారం 03 జూన్ 2020
National - Apr 02, 2020 , 22:52:38

కరోనా ఉందని అనుమానం.. కూలీ ఆత్మహత్య

కరోనా ఉందని అనుమానం.. కూలీ ఆత్మహత్య

తమిళనాడు: కరోనా ఉందంటూ స్థానికులు అనుమానించడంతో ఓ కూలీ ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు మధురైలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తి కేరళలో వలస కూలీగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో కేరళలో ఉపాధి కరువైంది. దీంతో అతడు ఎలాగోలా స్వగ్రామానికి చేరుకున్నాడు. అతడు కేరళ నుంచి వచ్చిన తరువాత స్వల్ప జలుబు, దగ్గు జ్వరంతో బాధపడ్డాడు. దీంతో స్థానిక వైద్యాధికారులు కరోనా పరీక్షలు జరిపారు. హోం క్వారంటైన్ లో ఉండాలని చేతిపై స్టాంప్ వేసి ఇంటికి పంపించారు. అయితే అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్తున్నప్పడు స్థానికులు తీసిన వీడియోలు వైరల్ అయ్యాయి. స్థానికులు, కుటుంబీకులు కరోనా ఉందంటూ అనుమానించడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతడి ఆత్మహత్య అనంతరం కరోనా నిర్ధారణ పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. అందులో అతడికి నెగిటివ్ వచ్చింది.


logo