బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 18:26:49

తమిళనాడులో ఒక్కరోజే 7వేల కరోనా కేసులు

తమిళనాడులో  ఒక్కరోజే 7వేల కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2లక్షలు దాటింది.   ఇవాళ ఒక్కరోజే 6,988   పాజిటివ్ కేసులు  నమోదైనట్లు  రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడచిన 24 గంటల్లో కరోనా వల్ల 89 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,06,737కు చేరింది. ఇప్పటి వరకు 1,51,055మంది కోలుకున్నారు.  కరోనా బారినపడి 3,409 మంది మరణించారు.  ప్రస్తుతం 52,273 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా తీవ్రత తమిళనాడులోనే ఎక్కువగా ఉన్నది. 


logo