గురువారం 22 అక్టోబర్ 2020
National - Aug 29, 2020 , 19:28:17

త‌మిళ‌నాడులో ఇంకా త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

త‌మిళ‌నాడులో ఇంకా త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. రోజూ వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. శ‌నివారం కూడా కొత్త‌గా 6,352 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,15,590కి చేరింది. అందులో 3,55,727 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారినుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 52,726 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌మిళ‌నాడులో భారీగానే న‌మోద‌వుతున్నాయి. శ‌నివారం కొత్త‌గా 87 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 7,137కు చేరింది. త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోనూ శ‌నివారం కొత్త‌గా 1285 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ న‌గ‌రంలో మొత్తం కేసుల సంఖ్య 1,33,173కు చేరింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo