గురువారం 09 జూలై 2020
National - Jun 21, 2020 , 18:53:43

త‌మిళ‌నాడులో కొత్త‌గా 2,532 కేసులు.. 53 మంది మృతి

త‌మిళ‌నాడులో కొత్త‌గా 2,532 కేసులు.. 53 మంది మృతి

చెన్నై : త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. దేశంలోనే క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల్లో త‌మిళ‌నాడు రెండో స్థానంలో నిలిచింది. గ‌డిచిన 24 గంట‌ల్లో త‌మిళ‌నాడులో కొత్త‌గా 2,532 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, మ‌రో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడులో 59377 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో 25,863 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 757కు చేరిన‌ట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. 

చెన్నైలో అత్య‌ధికంగా 39,641, చెంగ‌ల్ ప‌ట్టులో 3,620, తిరువ‌ల్లూరులో 2,414, కంచీపురంలో 1,905, తిరువ‌న్న‌మ‌లైలో 983 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 


logo