శుక్రవారం 10 జూలై 2020
National - Jun 28, 2020 , 19:01:54

తమిళనాడులో ఒక్కరోజే 3,940 కరోనా కేసులు

తమిళనాడులో ఒక్కరోజే 3,940 కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది.  రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 3,940 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే మరో 54 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య  82,275కు చేరింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 45,537 డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 35,656 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి రాష్ట్రంలో 1,079 మంది మరణించారు.


logo