గురువారం 09 జూలై 2020
National - Jun 16, 2020 , 18:34:49

తమిళనాడులో ఒక్కరోజే 1,515 కరోనా కేసులు

తమిళనాడులో ఒక్కరోజే 1,515 కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 1,515 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడచిన 24 గంటల్లో మరో 49 మంది కరోనా వల్ల చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,019కు చేరింది. ఇప్పటి వరకూ కరోనా  వల్ల 528 మంది మృతిచెందారు. ఇవాళ ఒక్కరోజే 19,242 శాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా 7,48,244 శాంపిల్స్‌ పరీక్షించారు. గత నెలరోజులుగా చెన్నై నగరంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. 

చెన్నైలో నిత్యం కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకుంది. కేసులు ఎక్కువగా నమోదవుతున్న చెన్నైతో పాటు  చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 


logo