శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 19:02:58

త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,881 క‌రోనా కేసులు.. 97 మ‌ర‌ణాలు

త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,881 క‌రోనా కేసులు.. 97 మ‌ర‌ణాలు

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా కేసుల తీవ్ర‌త మ‌రింత‌గా పెరుగుతున్న‌ది. గురువారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 5,881 క‌రోనా కేసులు, 97 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో వైర‌స్ సోకిన వారి మొత్తం సంఖ్య 2,24,859కి, చ‌నిపోయిన వారి సంఖ్య 3,935కి చేరుకున్న‌ది. కాగా, క‌రోనా నుంచి 1,83,956 మంది కోలుకున్నార‌ని ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. 

త‌మిళ‌నాడులో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆగ‌స్టు 31 వ‌ర‌కు పొడిగించిన‌ట్లు సీఎం ప‌ళ‌ని స్వామి గురువారం తెలిపారు. అంత‌ర్గ‌, అంత‌ర రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సు స‌ర్వీసుల‌ను కూడా నిలిపివేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.  ప్ర‌తి ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంద‌ని చెప్పారు.


logo