శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 18:50:50

త‌మిళ‌నాడులో మ‌రిన్ని కొత్త‌ కేసులు

త‌మిళ‌నాడులో మ‌రిన్ని కొత్త‌ కేసులు

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల విజృంభ‌ణ ఇంకా త‌గ్గ‌డంలేదు. గత కొన్నాళ్లుగా ప్ర‌తిరోజు ఐదు వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం కూడా కొత్త‌గా 5,791 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 5,80,808కి చేరింది. అందులో 5,25,154 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 46,341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌మిళ‌నాడులో క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మోద‌వుతూనే ఉన్నాయి. ఆదివారం కొత్త‌గా 80 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 9,313కు చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.       

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo