చైత్రం: ఈ నెలలో అశ్విని, భరణి, కృత్తిక మూడు కార్తెలు ప్రవేశిస్తున్నాయి. యోగాలు అనుకూలంగా ఉండడంతో నెల ప్రారంభంలో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. నెల ద్వితీయార్ధంలో వేడి వాతావరణం ఉంటుంది.
వైశాఖం: ఈ నెలలో కృత్తిక, రోహిణి, మృగశిర కార్తెల ప్రభావం ఉంటుంది. నెల మధ్యలో తేలికపాటి జల్లులకు అవకాశం. నెలాఖరులో ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి ఏర్పడవచ్చు. ఎండ తీవ్రత కూడా అధికంగానే ఉంటుంది.
జ్యేష్ఠం: ఈ నెలలో వాతావరణంపై మృగశిర, ఆరుద్ర, పునర్వసు కార్తెల ప్రభావం ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు తలెత్తవచ్చు. నెల మధ్యలో సామాన్య వర్షాలు, మాసాంతంలో మంచి వర్షాలకు అవకాశం.
ఆషాఢం: ఈ నెలలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కార్తెల ప్రభావం ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉండడంతో వ్యవసాయానికి అనుకూల వర్షాలు కురుస్తాయి. మాసం చివరిలో ఉష్ణోగ్రతలు పెరిగినా అడపాదడపా మంచి వర్షాలు ఉంటాయి.
శ్రావణం: ఈ మాసంలో ఆశ్లేష, మఘ, పుబ్బ కార్తెల ప్రభావం వాతావరణంపై ఉంటుంది. నెల చివరిలో వర్షాలు బాగా కురుస్తాయి. నదులు అనుకూలంగా ప్రవహిస్తాయి.
భాద్రపదం: ఈ నెలలో పుబ్బ, ఉత్తర, హస్త కార్తెలు ఉంటాయి. మొదట్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చు. తర్వాత ఒకింత అనుకూల వర్షపాతం నమోదవుతుంది. సామాన్య వర్షాలకు అవకాశం.
ఆశ్వీయుజం: ఈ మాసంలో హస్త, చిత్త, స్వాతి కార్తెలు వాతావరణంపై మిశ్రమ ప్రభావం చూపుతాయి. గాలితో కూడిన వర్షాలు కురవవచ్చు. కొన్నిచోట్ల అనుకూల వర్షాలు కురుస్తాయి. ఇంకొన్నిచోట్ల మేఘాలు గాలి కారణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారి వర్షిస్తాయి. తీరప్రాంతాల్లో తుపాను ప్రభావం ఉంటుంది.
కార్తీకం: ఈ నెలలో విశాఖ, అనురాధ కార్తెలు ప్రవేశిస్తున్నాయి. వీటి ప్రభావం వాతావరణంపై అనుకూలంగా ఉంటుంది. అవసరమైన వర్షాలు కురుస్తాయి. మాసం ద్వితీయార్థంలో సామాన్య వర్షపాతం నమోదవుతుంది. తీర ప్రాంతాలకు తుపాను హెచ్చరిక.
మార్గశిరం: కార్తెల ప్రభావం తక్కువగా ఉంటుంది. తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులకు అవకాశం.
పుష్యం: ఈ నెలలో అక్కడక్కడా సామాన్య వర్షాలు కురుస్తాయి. చలి తీవ్రత ఉంటుంది.
మాఘం: కార్తెల ప్రభావంతో వేడి క్రమంగా పెరుగుతుంది. తెల్లవారు జామున చలిగాలులు ఉంటాయి.
అక్కడక్కడా వర్షాలు పడొచ్చు.
ఫాల్గుణం: ఈ నెలలో ఉత్తరాభాద్ర, రేవతి కార్తెల ప్రభావంతో మొదట్లో ఎండలు ఉంటాయి. ద్వితీయార్ధంలో వర్ష సూచనలు ఉన్నాయి.
ఇవికూడా చదవండి..
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!