సోమవారం 06 జూలై 2020
National - Jun 19, 2020 , 16:12:58

మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్

మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్

చెన్నై : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి త‌మిళ‌నాడు రాష్ర్టాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఆ రాష్ర్ట ఉన్న‌త విద్యాశాఖ మంత్రి కేపీ అన్ బ‌ల‌గాన్ కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో మంత్రి చికిత్స నిమిత్తం ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చేరారు. క‌రోనా సోకిన మూడో రాజ‌కీయ నాయ‌కుడిగా మంత్రి నిలిచారు. ఇప్ప‌టికే డీఎంకే ఎమ్మెల్యే జే అన్ బ‌జాగాన్ కు క‌రోనా సోక‌డంతో చ‌నిపోయారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే కే ప‌ళ‌నికి కూడా క‌రోనా సోకింది. ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 

క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై విద్యాశాఖ మంత్రి అధ్య‌క్ష‌త‌న ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు. నార్త్ చెన్నై ప‌రిధిలో ఈ క‌మిటీ ప‌ర్య‌వేక్ష‌ణ చేసింది. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌పై బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఆ త‌ర్వాతే మంత్రికి క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.  స‌మీక్ష‌లో పాల్గొన్న మిగ‌తా వారు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోనున్నారు. 

త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు 52,334 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 625 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా పాజిటివ్ కేసుల్లో మ‌హారాష్ర్ట మొద‌టి స్థానంలో ఉండ‌గా, త‌మిళ‌నాడు రెండో స్థానంలో, ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది.


logo