ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Jul 10, 2020 , 16:32:48

తమిళనాడులో మరో మంత్రికి కరోనా పాజిటివ్

తమిళనాడులో మరో మంత్రికి కరోనా పాజిటివ్

చెన్నై: తమిళనాడులో మరో మంత్రికి కరోనా సోకింది. ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజుకు శుక్రవారం కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆయన అడ్మిట్ అయ్యారు. నాలుగు రోజుల కిందట మంత్రి భార్యకు కరోనా సోకడంతో గురువారం ఆయనకు కూడా పరీక్షలు జరిపారు. దీంతో సెల్లూర్ రాజుకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది.

తమిళనాడులో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు కరోనా బారినపడ్డారు. జూన్ 18న ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పి. అన్బాలగన్‌కు కరోనా సోకింది. జూలై 8న విద్యుత్ శాఖ మంత్రి పి.తంగమణికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందారు. తాజాగా ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్ కె. రాజుకు కూడా కరోనా సోకినట్లు తేలింది. తమిళనాడులో ఇప్పటి వరకు 1.22 లక్షల మందికి వైరస్ సోకగా 1700 మంది మరణించారు.

 
logo