శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 14:45:10

మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్

మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్

చెన్నై : త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తూనే ఉంది. తాజాగా కార్మిక శాఖ మంత్రి నిలోఫ‌ర్ క‌ఫీల్ కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో క‌రోనా సోకిన మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. కరోనా నుంచి కార్మిక శాఖ మంత్రి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని త‌మిళ‌నాడు సీఎం కే ప‌ళ‌నిస్వామి ప్రార్థించారు. 

క‌ఫిల్ కార్మిక శాఖ‌తో పాటు ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ఉపాధి శాఖ మంత్రిగా కొన‌సాగుతున్నారు. 

త‌మిళ‌నాడు మంత్రుల్లో మొద‌ట‌గా విద్యాశాఖ మంత్రి కేపీ అన్బ‌ల‌గ‌న్ కు క‌రోనా సోకింది. ఆయ‌న కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. విద్యుత్ శాఖ మంత్రి పీ తంగ‌మ‌ణి, మ‌రో మంత్రి కే రాజు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 

త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు 1,56,369 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 2,236 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 46,717 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ వైర‌స్ నుంచి 1,07,416 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 


logo