గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 12:42:06

కార్మిక మంత్రికి క‌రోనా పాజిటివ్‌

కార్మిక మంత్రికి క‌రోనా పాజిటివ్‌

చెన్నై: త‌మిళ‌నాడు కార్మిక సంక్షేమ శాఖ‌ మంత్రి నిలోఫ‌ర్ క‌ఫిల్ క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో ఆమె గ‌త మూడు రోజులుగా స్వీయ నిర్బంధంలో ఉంటుంన్నారు. తాజాగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఆమెకి పాజిటివ్ వ‌చ్చింది. దీంతో సీఎం కే ప‌ళ‌నిస్వామి మంత్రిమండ‌లిలో క‌రోనా బారిన‌ప‌డిన మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. 

నిలోఫ‌ర్ స‌హ‌చ‌ర మంత్రి ఓఎస్ మ‌ణియ‌న్ కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆయ‌న వ‌ద్ద ప‌నిచేస్తున్న ఉద్యోగుల్లో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. మొద‌ట మంత్రి కేపీ అన్బ‌ళ‌గ‌న్‌కు క‌రోనా పాజిటివ్ వచ్చింది. క‌రోనా నుంచి కోలుకున్న ఆయ‌న దవాఖాన నుంచి బుధ‌వారం డిశ్చార్జి అయ్యారు. త‌ర్వాత మంత్రులు సెల్లూర్ కే రాజు, పీ తంగ‌మ‌ణి క‌రోనా బారిన‌ప‌డ్డారు.


logo