గురువారం 28 మే 2020
National - May 20, 2020 , 10:36:07

తమిళనాడులో కరోనా విజృంభణ.. నిన్న ఒక్కరోజే 688 కేసులు

తమిళనాడులో కరోనా విజృంభణ.. నిన్న ఒక్కరోజే 688 కేసులు

చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుగా, తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 688 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కేవలం చెన్నైలోనే 552 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,448కి చేరింది. తమిళనాడు వ్యాప్తంగా కరోనాతో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 37,136 కేసులు నమోదు కాగా, 1,325 మంది చనిపోయారు. 

తమిళనాడులో కరోనా తీవ్రత ఉన్నప్పటికీ.. గ్రామాల్లో సెలూన్ల షాపులు తెరిచేందుకు అనుమతించారు. ఆటో విడి భాగాల తయారీ పరిశ్రమలకు కూడా అనుమతిచ్చారు. కంచీపురంలో యమహ మోటార్‌ కంపెనీని త్వరలోనే తెరుస్తామని ఆ పరిశ్రమ యజమానులు తెలిపారు. మే 15వ తేదీ నుంచే మద్యం షాపులను తమిళనాడులో తెరిచారు. 


logo