గురువారం 21 జనవరి 2021
National - Dec 22, 2020 , 12:15:59

న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌పై నిషేధం

న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌పై నిషేధం

చెన్నై : క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో నూత‌న సంవ‌త్స‌రం వేడుక‌ల‌పై త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిషేధం విధించింది. బీచ్‌ల‌తో పాటు బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఎలాంటి పార్టీల‌కు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. బీచ్ రెస్టారెంట్లు, రిసార్ట్స్, హోట‌ల్స్, క్ల‌బ్స్‌పై నిఘా పెట్టామ‌ని, న్యూ ఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. రోడ్ల‌పై కూడా ఎవ‌రూ గుమిగూడొద్ద‌ని తెలిపింది. డిసెంబ‌ర్ 31 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు బీచ్‌ల వ‌ద్ద జ‌నాలు సెలబ్రేష‌న్స్ చేసుకోవ‌ద్దు అని ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించి క‌రోనా వైర‌స్ నిరోధానికి కృషి చేయాల‌ని ప్ర‌భుత్వం కోరింది. 

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆపిల్ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు!

అదుపులోనే కొత్త ర‌కం క‌రో‌నా: డబ్ల్యూహెచ్‌వో
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. తొలిసారిగా 20వేల దిగువకు


logo