సోమవారం 18 జనవరి 2021
National - Jan 04, 2021 , 14:35:23

సినిమా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీ

సినిమా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీ

చెన్నై: సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో వంద శాతం ఆక్యుపెన్సీకి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనల మేరకు ఇప్పటి వరకు 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు నిర్వహిస్తున్నారు.  తాజాగా దీనిని వంద శాతానికి పొడిగించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడులోని సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఇకపై కరోనాకు ముందు మాదిరిగా పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. 

కాగా కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా కొత్త సినిమాలు విడుదల కాలేదు. మరోవైపు పొంగల్‌ పండగ సందర్భంగా కొత్త సినిమాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచినట్లు తెలుస్తున్నది. అయితే తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.