శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 15:20:29

సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌

సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌

చెన్నై: తమిళనాడులోని రాజ్‌భ‌వ‌న్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాజ్‌భ‌వ‌న్‌లోని మరో ముగ్గురికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్ర‌ గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. వైద్యుల సూచన మేరకు ఆయన ఏడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండ‌నున్నార‌ని రాజ్‌భవన్‌ అధికారులు వెల్లడించారు. గవర్నర్‌ ఆరోగ్యంగానే ఉన్నారని, ముందు జాగ్రత్త చ‌ర్య‌ల్లో భాగంగానే ఆయ‌న సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లార‌ని చెప్పారు. 

ఇటీవల రాజ్‌భవన్‌లో పనిచేసే 84 మంది భద్రతా, ఫైర్‌ సిబ్బంది కొవిడ్‌ బారిన‌ప‌డ్డారు. అయితే, వారిలో ఏఒక్కరూ గవర్నర్‌తో గానీ, సీనియర్‌ అధికారులతోగానీ కాంటాక్ట్‌ కాలేదని గురువారం రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే తాజాగా మరో 38 మందికి పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రిలాల్ పురోహిత్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల‌ని నిర్ణయం తీసుకున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo