మంగళవారం 04 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 17:54:13

తమిళనాడు గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌!

తమిళనాడు గవర్నర్‌కు కరోనా పాజిటివ్‌!

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. తాజాగా తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌(80)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన చెన్నైలోని  ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  గవర్నర్‌ భన్వరిలాల్‌  జూలై 29 నుంచి హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు.  తమిళనాడు రాజ్‌భవన్‌లో ఇటీవల 87 మందికి కరోనా సోకిన  విషయం తెలిసిందే. గవర్నర్‌కు కరోనా సోకినట్లు రాజ్‌భవన్‌ అధికారులు లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారికంగా  ప్రకటన విడుదల చేయలేదు. 


logo