మంగళవారం 26 జనవరి 2021
National - Dec 22, 2020 , 17:30:08

ఏఐఏడీఎంకే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది : స్టాలిన్‌

ఏఐఏడీఎంకే ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది : స్టాలిన్‌

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ఆరోపించారు. అక్రమాలకు  పాల్పడిన తమిళనాడు సీఎంతోపాటు మంత్రులపై చర్య తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఆయన గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌కు 97 పేజీల ఫిర్యాదు అందజేశారు. సీఎం యడప్పాడి పళనీస్వామితోపాటు క్యాబినెట్‌లోని ఏడుగురు మంత్రులు భారీగా అక్రమాస్తులు కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

అక్రమాలకు పాల్పడుతున్న సీఎం పళనీస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, మంత్రులు ఎస్‌పీ వేలుమణి, పీ తంగమణి, ఆర్‌ కామరాజ్‌, సీ విజయ్‌ భాస్కర్‌, ఆర్‌బీ ఉదయ్‌ కుమార్‌, డీ జయకుమార్‌పై చర్యలు తీసుకోవాలని గతంలో విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అందుకే తాము గవర్నర్‌ను కలిసి అవినీతి నిరోధక (సవరణ) చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని, తక్షణ చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారని స్టాలిన్‌ తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం ఏఐఏడీఎంకే పాలన అవినీతిమయంగా మారిందని ఆయన చెప్పారు.  

 ఇవికూడా చదవండి..

కశ్మీర్‌ డీడీసీ ఎన్నికల్లో ఫరూఖ్‌ కూటమి ఆధిక్యం

బిగ్ బాస్ సోహెల్‌కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo