సోమవారం 06 జూలై 2020
National - Jun 17, 2020 , 10:25:23

అమరుని కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

అమరుని కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

చెన్నై: చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన హవల్దార్‌ పళని కుటుంబానికి తమిళనాడు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థికసహాయం ప్రకటించింది. లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో సోమవారం రాత్రి భారత్‌, చైనా సైనికులు పరస్పరం దాడులు చేసుకోవడంతో తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన హవల్దార్‌ పళని మరణించారు.  

హవల్దార్‌ పళని మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే పళనిస్వామి తీవ్ర సంతాపం ప్రకటించారు. అమరుని కుటుంబానికి తక్షణమే రూ.20 లక్షలు  అందిస్తామని, అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు.  

భారత సైన్యంలో 22 ఏండ్లపాటు పళని వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు ఆరో తరగతి చదువుతుండగా, కుమార్తె మూడో తరగతి చదువుతున్నది. డిగ్రీ వరకు చదువుకున్న అతని భార్య రామనాథపురం జిల్లాలోని ఓ డిగ్రీ కళాశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు.


logo