శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 13:34:48

డీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

డీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

చెన్నై: తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కృష్ణగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టీ సెంగుట్టవన్‌కు తేలికపాటి కరోనా లక్షణాలు కనిపించడంతో ఇటీవల ఒక ప్రైవేట్ దవాఖానలో చేరారు. శనివారం ఆయన నుంచి నమూనాలు సేకరించి పరీక్ష జరుపగా కరోనా పాటిజివ్‌గా ఆదివారం నిర్ధారణ అయ్యింది.

డీఎంకే ఎమ్మెల్యే సెంగుట్టవన్ ప్రస్తుతం ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందతున్నారని కృష్ణగిరి ప్రాంత ఆరోగ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ వీ గోవిందన్ తెలిపారు. ఆ ఎమ్మెల్యేను ఇటీవల కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేసినట్లు ఆయన చెప్పారు. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1.61 లక్షలు దాటగా ఇప్పటి వరకు 2,315 మంది చనిపోయారు.
logo