గురువారం 02 జూలై 2020
National - Jun 17, 2020 , 14:29:47

కరోనాతో తమిళనాడు(cmo) కార్యదర్శి మృతి

కరోనాతో తమిళనాడు(cmo) కార్యదర్శి మృతి

చెన్నై : తమిళనాడులలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అక్కడి ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టినా.. కేసులు తగ్గడం లేదు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయ(cmo) కార్యదర్శి దామోదరం కరోనాతో మృతి చెందడం కలకలం రేపుతోంది.

చెన్నైలోని రాజీవ్‌గాంధీ దవాఖానలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు తమిళనాడు సచివాలయంలో 200 మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపడుతూ..నిబంధనలు పాటించాలని ప్రజలను హెచరిస్తున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు.


logo