బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 26, 2020 , 19:09:54

కరోనా సోకిన తమిళనాడు మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం

కరోనా సోకిన తమిళనాడు మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం

చెన్నై: కరోనా సోకి చికిత్స పొందుతున్న తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆర్‌ డొరైకన్నూ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ నెల 13న కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ న్యుమోనియాతో బాధపడుతున్న 73 ఏండ్ల ఆయనకు వెంటిలేటర్‌, ఎక్క్మో వంటి వ్యవస్థలపై చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. మంత్రి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైద్యుల బృందం ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

మాతృవియోగం చెందిన సీఎం పళని స్వామిని పరామర్శించేందుకు మంత్రి ఆర్‌ డొరైకన్నూ ఈ నెల 13న సేలం నుంచి చెన్నైకి వెళ్తుండగా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో ఆయనను వెంటనే విల్లుపురంలోని ప్రభ్వుత్వ దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స అందజేశారు. అనంతరం ప్రాణాధారిత అంబులెన్స్‌లో చెన్నైలోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.