గురువారం 26 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 06:33:14

క‌రోనాతో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి మృతి

క‌రోనాతో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి మృతి

చెన్నై: త‌మిళ‌నాడు వ్య‌వ‌సాయశాఖ మంత్రి దొరైక్క‌న్ను క‌రోనాతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా క‌రోనా చికిత్స పొందుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో నిన్న అర్థ‌రాత్రి 11.15 గంట‌ల‌కు క‌న్నుమూశారు. అక్టోబ‌ర్‌ 13న శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌టంతో వెంట‌నే ఆయ‌న‌ను విల్లుపురం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో చేరారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం కావేరీ ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌గా అక్క‌డ క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న చికిత్స పొందుతున్నారు. 

1948లో తంజావూరు జిల్లా రాజ‌గిరిలో జ‌న్మించిన దొరైక్క‌న్ను మూడుసార్లు పాప‌నాశం అసెంబ్లీ స్థానం నుంచి గెలుసొందారు. 2016లో సీఎం పళ‌నిస్వామి కేబినెట్‌లో వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ‌