శనివారం 16 జనవరి 2021
National - Jan 02, 2021 , 16:25:30

బ‌స్సును అప‌హ‌రించిన‌ తాలిబ‌న్‌లు.. బంధీలుగా 45 మంది ప్ర‌యాణికులు!

బ‌స్సును అప‌హ‌రించిన‌ తాలిబ‌న్‌లు.. బంధీలుగా 45 మంది ప్ర‌యాణికులు!

హెరాత్‌: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్‌ల అరాచ‌కాలు కొన‌సాగుతున్నాయి. గ‌త రాత్రి పోలీసులపై దాడి చేసి ఆరుగురి ప్రాణాలు తీసిన ఘ‌ట‌న‌ను మ‌రువ‌క‌ముందే తాజాగా మ‌రో దారుణానికి పాల్ప‌డ్డారు. ఏకంగా 45 ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఒక బ‌స్సును అప‌హ‌రించి గుర్తు తెలియ‌ని ప్రాంతానికి త‌ర‌లించారు. ఆఫ్ఘినిస్థాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌లో శ‌నివారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. హెరాత్ సిటీ-తుర్గుంది ర‌హ‌దారిపైగ‌ల చిల్డోఖ్తార‌న్ ఏరియా నుంచి ఉగ్ర‌వాదులు బ‌స్సును అప‌హ‌రించారు. ఆఫ్ఘ‌నిస్థాన్ మీడియా సంస్థ షంష‌ద్ న్యూస్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి తాలిబ‌న్‌లు ఇంకా ఎలాంటి స్పంద‌న తెలియ‌జేయ‌లేదు.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.