శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 13:54:15

క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాం: పేర్ని నాని

క‌రోనా క‌ట్ట‌డికి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాం: పేర్ని నాని

అమ‌రావ‌తి: ప‌్ర‌పంచ‌దేశాల‌ను అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోకి నెట్టిన క‌రోనా (కొవిడ్‌-19) మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ స‌మాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. శుక్ర‌వారం మంత్రివ‌ర్గ స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడిన నాని.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం లేద‌ని చెప్పారు. అయితే 2020-21 ఆర్థిక ఏడాదికిగాను తొలి మూడు నెల‌ల కాలానికి అవ‌స‌ర‌మైన ఖ‌ర్చుల కోసం ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం ల‌భించింద‌న్నారు. 

చేతులెత్తి మొక్కుతున్నాం.. ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండిపోవాలని మంత్రి సూచించారు. ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని ఆయ‌న‌ చెప్పారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ప్ర‌స్తుత ప‌రిస్థితిని అర్థం చేసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా క‌ట్ట‌డికి జిల్లాల వారీగా, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా టాస్క్‌ఫోర్స్ లు ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.   


logo