శుక్రవారం 05 జూన్ 2020
National - May 15, 2020 , 02:04:19

ఏడాది పాటు తన వేతనంలో 30 శాతం కోత

ఏడాది పాటు తన వేతనంలో 30 శాతం కోత

  • రాష్ట్రపతి స్వీయ పొదుపు చర్యలు

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భాగంగా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టనున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. ఈ ఏడాదంతా వేతనంలో 30 శాతం కోత విధించుకోవాలని నిర్ణయించారు. ఈ చర్యల వల్ల సుమారు రూ.200 కోట్లకుపైగా వార్షిక బడ్జెట్‌లో 20 శాతం అంటే రూ.40-45 కోట్లు ఆదా అవుతాయని అధికారుల అంచనా. రాష్ట్రపతి తీసుకునే పొదుపు చర్యలు ఇవే..

  • దేశీయ పర్యటనలు, కార్యక్రమాలు తగ్గింపు
  • ఎట్‌ హోం, ఇతర విందుల్లో అతిథుల సంఖ్య, ఆహార పదార్థాల తగ్గింపు
  • ప్రత్యేక కార్యక్రమాల్లో వినియోగించే లిమోసైన్‌ (రూ.10 కోట్ల విలువైన కారు) కొనుగోలు వాయిదా
  • రాష్ట్రపతి భవన్‌లో అవసరం మేరకే మరమ్మతులు
  • ఈ ఆర్థిక సంవత్సరం వరకు కొత్త నిర్మాణ పనులకు దూరం
  • ఇంధనం, విద్యుత్‌ వినియోగంలో పొదుపు చర్యలు
  • పర్యావరణ హితంగా రాష్ట్రపతి భవన్‌ కార్యాలయం. సాంకేతిక విధానాల ద్వారా ప్రజలతో కోవింద్‌ మమేకం


logo