గురువారం 02 జూలై 2020
National - Apr 29, 2020 , 13:30:45

రాహుల్‌జీ లోన్లమాఫీ ప్ర‌భుత్వ ప‌నికాదుః జ‌వ‌దేక‌ర్‌

రాహుల్‌జీ లోన్లమాఫీ ప్ర‌భుత్వ ప‌నికాదుః జ‌వ‌దేక‌ర్‌

దేశంలో బ్యాంకులు ఉద్దేశ‌పూర్వ‌క రుణ ఎగ‌వేత దారుల రుణాల‌ను ర‌ద్దుచేయ‌టంపై రాజ‌కీయ దుమారం రేగుతున్న‌ది. రూ.65000 కోట్ల మొండిబ‌కాయిల‌ను బ్యాంకులు మంగ‌ళ‌వారం మాఫీ చేశాయి. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై కేంద్ర మంత్రులు కూడా రాహుల్‌గాంధీకి కౌంట‌ర్ ఇస్తున్నారు. తాజాగా ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ రాహుల్ విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు. లోన్లు ప్ర‌భుత్వం మాఫీ చేయ‌ద‌ని గుర్తుంచుకోవాల‌ని చుర‌క‌లంటించారు. నిర‌ర్ధ‌క ఆస్తుల‌ను వ‌దిలించుకోవ‌ట‌మ‌నేది బ్యాంకుల్లో సాధార‌ణంగా జ‌రిగే ప్ర‌క్రియ అని, ఎగ‌వేత‌దారుల నుంచి లోన్లు రాబ‌డితే బ్యాంకుల‌ను తాము ఆప‌బోమ‌ని అన్నారు. 


logo