హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘మొక్కై వంగనిది.. మానై వంగునా’ అనే సామెత పిల్లల పెంపకం ఎలా ఉండాలో చెప్పేందుకు తరచూ వాడుతుంటాం. పిల్లలకు చిన్ననాటి నుంచే సద్గుణాలు అలవడేలా తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోతే వాళ్లు చెడు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంటుం ది. ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాల వ్యవస్థ వచ్చాక చిన్నారులకు కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు కరువయ్యాయి. తల్లిదండ్రులు ఉద్యోగ, వ్యాపార పనులపైనే ఎక్కువ సమ యం వెచ్చిస్తుండటంతో పిల్లలు రోజూ ఏం చేస్తున్నారు? ఎవరితో సమయం గడుపుతున్నారు? ఎలాంటి అలవాట్లు అలవర్చుకొంటున్నారు? అన్నదానిపై దృష్టి పెట్టడం లేదు. దీంతో చాలామంది పిల్లలు స్వార్థపరుల చేతుల్లో చిక్కి సమిధలవుతున్నారు. సోషల్ మీడియాలో చెడు సావాసాలతో బోస్టన్ స్కూళ్లలో మగ్గిపోతున్నారు. ఎంత బిజీ జీవితం గడిపినా పిల్లల ప్రవర్తనపైన తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా, యురోపియన్ దేశాల్లో చిన్నారుల భవిష్యత్తుకు భద్రతనిచ్చేలా అక్కడి చట్టాలు పకడ్బందీగా ఉంటున్నాయని చెప్తున్నారు.
అమెరికాలో పిల్లల పెంపకంపై ప్రత్యేక శిక్షణ
అమెరికాలో పిల్లల పెంపకానికి ప్రత్యేక చట్టాలు, శిక్షణలు ఉన్నాయి. ‘అక్కడ బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికా (బీఎస్ఏ)’ శిక్షణ పొందిన వారికి మాత్రమే ఇతరుల పిల్లలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. 16 నుంచి 18 ఏండ్ల వర కు పిల్లలతో ఇతరులు మాట్లాడాలంటే వారి తల్లిదండ్రులు, లేదంటే టీచర్ల సమక్షంలోనే మాట్లాడాలి. నేరుగా మాట్లాడితే నేరంగా పరిగణిస్తారు. పిల్లలతో నేరుగా ఈ మెయిల్ కమ్యూనికేషన్ కూడా చట్ట విరుద్ధమే. బీఎస్ఏ శిక్షణ పూర్తిచేసినవారికి మాత్రమే ఇతరుల పిల్లలతో మాట్లాడేందుకు, వారిని పాఠశాల నుంచి ఇంటి దగ్గర కారులో దిగబెట్టేందుకు అనుమతి ఉంటుంది. ఒకసారి ఈ శిక్షణ తీసుకున్న తర్వాత రెండేండ్లవరకు ఇలా అనుమతి ఉంటుందని అట్లాంటాలో ఉంటున్న ప్రవాస భారతీయుడు పొద్దుటూరి నిరంజన్ తెలిపారు.
పిల్లల పెంపకంలో భారత్‌ది 41వ స్థానం
పిల్లల పెంపకంపై హ్యాపీనెస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ 159 దేశా ల్లో 2,60,000 మందిని సర్వేచేసి ఓ రిపోర్టును రూపొందించిం ది. దాని ప్రకారం అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న దేశాల్లో డెన్మార్క్ టాప్‌లో నిలువగా, భారత్ 41వ స్థానంలో ఉన్నది.
దేశం ర్యాంకు
డెన్మార్క్ 1
స్వీడన్ 2
నార్వే 3
నెదర్లాండ్స్ 4
కెనడా 5
ఫిన్లాండ్ 6
స్విట్జర్లాండ్ 7
న్యూజీలాండ్ 8
ఆస్ట్రేలియా 9
ఆస్ట్రియా 10