శనివారం 16 జనవరి 2021
National - Dec 21, 2020 , 15:17:20

యోగీజీ.. కాస్త ఆవుల‌ను ప‌ట్టించుకోండి: ప‌్రియాంకా లేఖ‌

యోగీజీ.. కాస్త ఆవుల‌ను ప‌ట్టించుకోండి: ప‌్రియాంకా లేఖ‌

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఆవుల ప‌రిస్థితి చాలా దారుణంగా ఉందంటూ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ. ఈ మ‌ధ్య ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన ఫొటోల గురించి ఆమె ప్ర‌స్తావించారు. ల‌లిత్‌పూర్‌లో ఆవుల‌ క‌ళేబరాలు క‌నిపించ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ.. అవి స‌రైన ఆహారం, నీరు లేక మృత్యువాత ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని అన్నారు. ఇలాంటి ఫొటో రావ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలోనూ రాష్ట్రంలో ఆవుల దుస్థితిని క‌ళ్ల‌కు క‌ట్టేలా ఎన్నో ఫొటోలు క‌నిపించాయి. వాటిని సంర‌క్షించ‌డానికి సరైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది అని యోగీకి రాసిన లేఖ‌ల ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ ప్రియాంకా ట్వీట్ చేశారు. ప్ర‌భుత్వం గోశాల‌లు ప్రారంభించినా.. వాటిలో ప‌రిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయ‌ని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉన్న చ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి గో-ధ‌న్ న్యాయ్ యోజ‌న‌ను ప్రారంభించార‌ని, యోగి ప్ర‌భుత్వం కూడా ఆ ప‌థకాన్ని యూపీలో అమ‌లు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప‌థ‌కం కింద ఆవుల పెండ‌ను సేక‌రించి, వాటితో ఎరువులు త‌యారు చేసి విక్ర‌యిస్తార‌ని, దీనివ‌ల్ల గోశాల‌లు స్వ‌యం స‌మృద్ధి సాధిస్తాయ‌ని ప్రియాంకా చెప్పారు.