బుధవారం 03 జూన్ 2020
National - Apr 04, 2020 , 21:45:50

చైనాపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే- రామ్ దేవ్‌ బాబా

చైనాపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే- రామ్ దేవ్‌ బాబా

చైనాపై యోగాగురు రామ్‌దేవ్ బాబా మండిప‌డ్డారు. ప్ర‌పంచ దేశాలను వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హమ్మారికి కార‌ణం చైనానేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చైనా అమానుష, అనైతిక చర్యలకు పాల్పడిందని ఫైర్ అయ్యారు. మొత్తం ప్రపంచాన్ని ఘోర ప్రమాదంలో పడేసిన చైనాను...  ప్రపంచ సమాజం  శిక్షించాల్సిందేన‌న్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌ దౌత్యపరమైన చొరవ తీసుకోవాలని ట్వీట్ చేశారు. మొదట ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండడంతోనే అన్ని దేశాలకు వైరస్‌ విస్తరించిందని చైనాను ప‌లువురు ఇప్ప‌టికే నిందిస్తున్నారు.


logo