గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 00:43:38

‘తాజ్‌'కు ట్రంప్‌ ఫిదా గైడ్‌ నితిన్‌కుమార్‌ వెల్లడి

‘తాజ్‌'కు ట్రంప్‌ ఫిదా గైడ్‌ నితిన్‌కుమార్‌ వెల్లడి

ఆగ్రా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, అమెరికా మొదటి మహిళ మెలానియా తాజ్‌మహల్‌ అందాలను చూసి ఫిదా అయ్యారు. ట్రంప్‌ దంపతులను తాజ్‌మహల్‌ ఆకట్టుకున్నదని వారికి గైడ్‌గా వ్యవహరించిన ఆగ్రాకు చెందిన నితిన్‌కుమార్‌ పేర్కొన్నారు. పాలరాతి కట్టడం అందాలను చూడగానే ‘అద్భుతం’ అని ట్రంప్‌ పేర్కొన్నట్టు చెప్పారు. ట్రంప్‌, మెలానియాతో కలిసి తాజ్‌ను సోమవారం సందర్శించడం తెలిసిందే. ‘తాజ్‌మహల్‌ చరిత్రను, నిర్మాణం, దాని వెనుక ఉన్న కథను ట్రంప్‌ దంపతు లకు తెలియజేశా. మొఘల్‌ చక్రవర్తి షాజ హాన్‌, ఆయన భార్య ముంతాజ్‌ మహల్‌ కథను చెప్పాను. సొంత కుమారుడు ఔరంగాజేబు.. షాజహాన్‌ను ఎలా నిర్బంధించారు, అతను మరణించాక ముంతాజ్‌ సమాధి పక్కనే ఆయనను ఖననం చేసిన విషయాలు తెలుసుకొన్న తర్వాత ట్రంప్‌ ఉద్వేగానికి గురయ్యారు’ అని నితిన్‌కుమార్‌ తెలిపారు. స్మారక చిహ్నం కట్టడాన్ని చూడగానే ట్రంప్‌ దంపతుల నోటమాట రాలేదని చెప్పారు. తాజ్‌ నిర్మాణం గురించి చెప్తున్నప్పుడు ఆసక్తి కనబర్చారని పేర్కొన్నారు. 
logo
>>>>>>