శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 13:28:29

సోమ‌వారం తాజ్‌మ‌హ‌ల్ మూసివేత‌

సోమ‌వారం తాజ్‌మ‌హ‌ల్ మూసివేత‌

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ భార‌త్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే.  సోమ‌వారం రోజున ఆయ‌న ఆగ్రాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో తాజ్‌మ‌హ‌ల్ వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. సోమ‌వారం రోజున ట్రంప్ తాజ్‌మ‌హ‌ల్‌ను సంద‌ర్శిస్తారు. ఆ రోజున మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు తాజ్‌ను మూసివేస్తారు. సాధార‌ణ‌ విజిట‌ర్స్‌ను అనుమ‌తించ‌రు. సెక్యూర్టీ కార‌ణాల వ‌ల్ల తాజ్‌ను మూసివేయ‌నున్న‌ట్లు ఆగ్రా పోలీసు అధికారి వ‌సంత్ కుమార్ స్వ‌ర్ణ‌కార్ తెలిపారు.  తాజ్ ప‌రిస‌రాల్లో ఉన్న ఇండ్లు, షాపులు, రెస్టారెంట్లు, హోట‌ల్స్‌ను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.  స్థానిక వ్యాపారుల నుంచి ఆధార్ కార్డు ప‌త్రాల‌ను సేక‌రించారు.  


logo